IPL 2021 : Kolkata Knight Riders (KKR) camp has been affected with Sandeep Warrier and Varun Chakravarthy testing positive for the virus.KKR last played a game against Delhi Capitals on April 29 and it remains to be seen if the Delhi franchise players will also be tested now.
#IPL2021
#KKRVSRCBMatchPostponed
#VarunChakravarthy
#DelhiCapitalsplayers
#biobubble
#CSKMemberstestCOVID19positive
#KKRPlayerstestCOVID19positive
#KKRvsRCBiplgameCancelled
#PatCummins
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#SandeepWarrier
#BCCI
దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నడుమ సజావుగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో నేడు(సోమవారం) ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా అధికారికంగా ధృవీకరించింది. అయితే అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు బబుల్‌లోకి వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయం అంతుపట్టడంలేదు. బీసీసీఐ కఠిన ప్రొటోకాల్స్ నేపథ్యంలో బయో బబుల్‌లోకి వైరస్ ప్రవేశించడం దాదాపు అసాధ్యం.అసలు ఈ లీగ్‌లో పాలుపంచుకునే మైదాన సిబ్బంది నుంచి టీవీ క్రూ, హోటల్ సిబ్బంది వరకు అందరూ కఠిన బబుల్‌లోనే ఉంటారు. అలాంటప్పుడు వైరస్ ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు ప్రచారం జరుగుతోంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అక్కడే అతనికి వైరస్ సోకినట్లుందని ప్రచారం జరుగుతుంది. ఇక బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో గత నాలుగు రోజుల్లో చేసిన మూడో పరీక్షల్లో వరుణ్, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ వచ్చినట్లు పేర్కొంది.